LOADING...
Telangana: రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Telangana: రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక, తమిళనాడు దిశగా విస్తరించి కొమరిన్‌ ప్రాంతం వరకూ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు నమోదయ్యాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

వివరాలు 

రైతులకు హెచ్చరికలు జారీ

ఇదిలా ఉండగా, మంగళ,బుధవారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముండటంతో పంటలు, తోటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే తగ్గినట్లు నమోదైంది.

Advertisement