Andhra Pradesh: ఏపీలో మారిన వాతావరణం.. మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది. కొమొరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
వివరాలు
తిరుపతిలో అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్
ఈ ద్రోణి ప్రభావంతోనే కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.
తిరుపతిలో అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 37.9, నెల్లూరులో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కర్నూలు, కావలిలో 36.6 డిగ్రీలు, నంద్యాలలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.