Loading...
LK Advani: కోలుకున్న ఎల్‌కే అద్వానీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి
కోలుకున్న ఎల్‌కే అద్వానీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి

LK Advani: కోలుకున్న ఎల్‌కే అద్వానీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ సీనియర్ నాయకుడు,మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 98 ఏళ్ల అద్వానీ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఈ నెల 16వ తేదీ సాయంత్రం అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని పల్మనరీ విభాగంలో చేర్పించారు. అక్కడ సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందించారు. చికిత్సకు ఆయన శరీరం సానుకూలంగా స్పందించిందని,ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి తన ప్రకటనలో పేర్కొంది.

వివరాలు 

ఇటీవల వయోభారంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరిన అద్వానీ

అద్వానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా అద్వానీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వయోభారం కారణంగా అద్వానీ ఇటీవలి కాలంలో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఈ ఏడాది మే నెలలోనూ వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

అంతకుముందు 2024 డిసెంబర్‌లో కూడా ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ADVERTISEMENT