LOADING...
Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 
Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ

Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 

వ్రాసిన వారు Stalin
Jan 30, 2024
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 16మంది అభ్యర్థుల పేర్లను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. తొలి జాబితాలో అఖిలేష్ కుటుంబానికి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ వంటి పెద్ద నేతలకు సీట్లు ప్రకటించారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు సీట్ల పంపకంపై ఇండియా కూటమితో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. యూపీలో ఇప్పటి వరకు బీజేపీతో పాటు ఏ పార్టీకి కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎవరూ ఊహించని విధంగా ఎస్పీ తొలి జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది.

యూపీ

యూపీలో 60 స్థానాల్లో ఎస్పీ పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆర్ఎల్‌డీ, ఎస్పీ చేతుల కలిపాయి. యూపీలోని 80 స్థానాలకు గానూ 60 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ నిర్ణయించింది. జయంత్ చౌదరికి చెందిన ఆర్‌ఎల్‌డీకి ఏడు సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌కు 11 సీట్లు ఇస్తామని అఖిలేష్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అఖిలేష్ ప్రకటించిన సీట్లపై కాంగ్రెస్ ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తుపై గందరగోళం నెలకొంది. రెండు పార్టీల మధ్య అంతర్గత చర్చలు జరిగాయని కొందరు అంటున్నారు. కాంగ్రెస్ అనుమతితోనే అఖిలేష్ అభ్యర్థులను ప్రకటించినట్లు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5, అప్నాదళ్ రెండు సీట్లు గెలుచుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి జాబితా ఇదే..