Nara Lokesh: మంగళగిరి వాసులకు లోకేష్ గుడ్‌న్యూస్.. ఎంట్రీ ఫ్రీ అంటూ కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చే దిశగా కృషి చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన, ప్రజలకు మరింత చేరువవుతూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళగిరి ప్రాంత వాకర్లు స్థానిక ఎకో పార్క్‌లో ఉచితంగా నడిచేందుకు అనుమతి కల్పించాలని లోకేష్‌ను కోరారు.
దీనిపై స్పందించిన లోకేష్, మంగళగిరి ఎకో పార్క్ అటవీ శాఖ పరిధిలో ఉందని, ఉచిత ప్రవేశం అందించడంపై స్వయంగా అధికారులతో చర్చించారు.
అయితే ఫారెస్ట్ శాఖ నిబంధనల ప్రకారం, పార్క్ నిర్వహణ ఖర్చుల కోసం ప్రవేశ రుసుం తప్పనిసరి అని తెలియజేశారు. దీంతో వాకర్ల కోరికను నెరవేర్చేందుకు నారా లోకేష్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
Details
అధికారిక ప్రకటన విడుదల
తాను ఎన్నికల సమయంలో వాకర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, వారికోసం మంగళగిరి ఎకో పార్క్‌లో వార్షికంగా వసూలు చేసే రూ.5 లక్షల ప్రవేశ రుసుమును తన వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇకపై మంగళగిరి వాసులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎలాంటి రుసుం లేకుండా ఎకో పార్క్‌లో నడవవచ్చని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ఈ తరహా ప్రజా సంక్షేమ చర్యలు కొనసాగిస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు.