Loading...
Dalmia Cement Plant: కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి
కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి

Dalmia Cement Plant: కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ లిమిటెడ్ ప్లాంట్‌లో రెండో దశ (లైన్-2) విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రూ.3,478 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ విస్తరణకు అధికారులు,సంస్థ యాజమాన్యం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రస్తుతం చిన్నకొమెర్ల దాల్మియా ప్లాంట్‌లో ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్,3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జరుగుతోంది. రెండో దశ విస్తరణ పూర్తయిన తర్వాత క్లింకర్ ఉత్పత్తి సామర్థ్యం 6.1మిలియన్ టన్నులకు, సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 9.6 మిలియన్ టన్నులకు పెరగనుంది.

వివరాలు 

700 మందికి కొత్త ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టు కడప జిల్లాలోని అతిపెద్ద పారిశ్రామిక విస్తరణల్లో ఒకటిగా నిలవనుంది.

ప్రస్తుతం దాల్మియా సిమెంట్ ప్లాంట్ ద్వారా దాదాపు 950 మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది.

కొత్త విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే మరో 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.

అలాగే రవాణా, గనులు, కాంట్రాక్టులు, సేవా రంగం, చిన్న తరహా పరిశ్రమలు వంటి అనుబంధ రంగాల్లో వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

వివరాలు 

ఏఐ, రోబో టెక్నాలజీతో ఆధునిక ప్లాంట్

విస్తరణలో భాగంగా ప్లాంట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

జర్మనీ, చైనా దేశాల సాంకేతికతను వినియోగించడంతో పాటు రోబో ల్యాబ్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

అదనంగా పర్యావరణహిత ఈవీ ఆధారిత రవాణా వ్యవస్థ, ప్రత్యేక రైల్వే లాజిస్టిక్స్ సదుపాయం, రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది

ప్రస్తుతం దాల్మియా సిమెంట్ ప్లాంట్ ద్వారా మైనింగ్ రాయల్టీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.102 కోట్ల ఆదాయం లభిస్తోంది.

రెండో దశ విస్తరణ పూర్తయిన తర్వాత ఈ ఆదాయం రూ.310 కోట్లకు చేరనుంది.

ADVERTISEMENT

వివరాలు 

కడప చేరుకున్న మంత్రి లోకేశ్.. నేటి కార్యక్రమాలు

ఇందులో రూ.120 కోట్లు మైనింగ్ రాయల్టీగా, మరో రూ.190 కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సమకూరనున్నాయి.

మంత్రి నారా లోకేశ్ మంగళవారం సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత,కలెక్టర్ చెరుకూరి శ్రీధర్,కూటమి ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో జమ్మలమడుగు మండలంలోని గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై ఉన్న కరమలవారిపల్లె నైట్ షెల్టర్‌కు చేరుకుని రాత్రి బస చేశారు.

బుధవారం ఉదయం దాల్మియా సిమెంట్ రెండో దశ విస్తరణ పనులకు శంకుస్థాపన,భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో దొరసానిపల్లెలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు.

ADVERTISEMENT