Loading...
Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన

Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు సమీపంలోని చదలవాడ వద్ద రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ బ్రాండ్ 'రాడిసన్' 5 స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. ప్రముఖ రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హోటల్‌ను నిర్మించనున్నారు. ఒంగోలులో ఇదే తొలి అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ కానుంది. మొత్తం 151 విలాసవంతమైన గదులతో పాటు మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్లు, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్ వంటి ఆధునిక సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

భారీ బ్యాంకెట్ హాళ్లు,కాన్ఫరెన్స్ రూమ్‌లు 

బిజినెస్ టూరిజం అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2,100చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో భారీ బ్యాంకెట్ హాళ్లు,కాన్ఫరెన్స్ రూమ్‌లను నిర్మిస్తున్నారు.

జాతీయ రహదారి-16కు అతి సమీపంలో ఈ హోటల్ ఏర్పాటు కానుండటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు,పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త హోటల్ అందుబాటులోకి వస్తే ఒంగోలు,పరిసర ప్రాంతాల్లో హాస్పిటాలిటీ,పర్యాటకం,రవాణా, సేవా రంగాలకు మరింత ఊతం లభించనుంది.

వివరాలు 

హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో స్థానిక యువతకు ఉపాధి

ముఖ్యంగా స్థానిక యువతకు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం లోకేశ్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఆత్మీయంగా కలిశారు.

అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వారి నుంచి వినతులను స్వీకరించారు.

రక్షా బంధన్ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలు లోకేశ్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒంగోలులో హాస్పిటాలిటీ రంగానికి ఊతం

ADVERTISEMENT