Telangana: టోకెన్ విధానంలో కమర్షియల్ సిలిండర్లు.. చర్లపల్లిలో వాహనాల రద్దీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 11, 2026
11:50 am
ఈ వార్తాకథనం ఏంటి
చర్లపల్లిలో ఉన్న భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన ప్లాంట్లలో ఇంధన సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గతంతో పోల్చితే సరఫరా దాదాపు 75శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. చర్లపల్లిలోని ఈమూడు ప్రధాన ప్లాంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక,మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా చమురు సరఫరా జరుగుతుంది. అయితే ప్రస్తుతం సరఫరా తగ్గిపోవడంతో కొనుగోలుదారులకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టోకెన్ విధానంలో పరిమిత సంఖ్యలో మాత్రమే కమర్షియల్ సిలిండర్లను ఆయా కంపెనీలు అందజేస్తున్నాయి. ఈపరిస్థితుల వల్ల చర్లపల్లిలోని ప్రధాన ప్రాంతాల్లో ఇంధనం కోసం వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సరఫరా తగ్గుదల కారణంగా అక్కడి ప్రాంతాల్లో రద్దీ మరింత పెరిగింది.