Loading...
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన

AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు

కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు

అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వివరాలు

రాయలసీమలోనూ వర్ష సూచన

రాయలసీమ ప్రాంతంలోనూ రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం, మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.

అక్కడక్కడ మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ADVERTISEMENT