LOADING...
AP Rains: 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక

AP Rains: 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదే సమయంలో బిహార్‌ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

వివరాలు

పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. దీనితో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. మరోవైపు, ఆదివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో గరిష్ఠంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన తెలిపారు.

Advertisement