Weather Report: కోస్తాలో ఈదురుగాలులు.. ఏపీలో వారం రోజుల పాటు వర్షాల హెచ్చరిక
వ్రాసిన వారు
Sirish Praharaju
May 11, 2026
05:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని శ్రీలంక సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు.
వివరాలు
కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వివరించారు. గత 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.