Symi: హర్మూజ్ దాటి భారత్‌కు చేరిన ఎల్పీజీ నౌక 'సైమి'
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, భారత్‌కు ఎల్పీజీని తీసుకొస్తున్న మరో భారత నౌక సురక్షితంగా చేరుకుంది. ఎల్పిజి ట్యాంకర్ సిమి పేరుతో ఉన్న ఈ ట్యాంకర్ ఆదివారం గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరింది. అధికారుల వివరాల ప్రకారం, ఈ నౌకలో సుమారు 20,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఖతార్‌లోని రాస్ లఫాన్ టెర్మినల్ నుంచి బయల్దేరిన ఈ క్యారియర్ మే 13న హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. ఇదిలా ఉండగా మరో భారత నౌక అయిన సన్ సైన్ కూడా గురువారం హర్మూజ్‌ను దాటినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వివరాలు
సోమవారినికి కొత్త మంగళూర్ పోర్టుకు
ఈ నౌకలో 46,427 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు తెలిపింది. సోమవారం నాటికి ఇది కొత్త మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు నౌకల్లోని వంటగ్యాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందినదని సమాచారం. హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని సురక్షితంగా దాటిన భారత నౌకల సంఖ్య 13కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరోవైపు భారత్‌కు ఇంధన సరఫరా చేస్తున్న మరో 12 నౌకలు ఇప్పటికీ గల్ఫ్ ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో దేశ ఇంధన సరఫరాపై అప్రమత్తత కొనసాగుతోంది.