Loading...
Y.S.Jagan: సీఈసీ నియామక విధానంపైకేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశా: వై.ఎస్.జగన్
సీఈసీ నియామక విధానంపైకేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశా: వై.ఎస్.జగన్

Y.S.Jagan: సీఈసీ నియామక విధానంపైకేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశా: వై.ఎస్.జగన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల కమిషనర్ల నియామక విధానానికి గతంలో వైకాపా మద్దతు తెలిపి తప్పు చేసిందని, ఇప్పుడు దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీకి అనుకూలంగా నియమించే విధానంలో మార్పులు రావాలని సూచించారు. ఆదివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘాల నియామక ప్రక్రియ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేశారు.

వివరాలు 

ఎన్నికల కమిషనర్ల నియామకంలో సంస్కరణలు రావాలి

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి,ఆయన నామినేట్‌ చేసిన కేంద్ర మంత్రి,ప్రతిపక్ష నేతకు ఓటు హక్కులు ఉన్నాయని జగన్‌ వివరించారు.

ప్రధాని,కేంద్ర మంత్రి ఇద్దరి ఓట్లు ఒకే అభ్యర్థికి పడే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నియామకం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతోందని విమర్శించారు.

గతంలో ఉన్న విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు. ప్రధాని,ప్రతిపక్ష నేత,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని సూచించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను నియమించేలా సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇలాంటి మార్పులు చేసినప్పుడే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై జగన్‌ తీవ్ర విమర్శలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాపైనా జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయత చూపడంలో పునేఠా కరుడుగట్టిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆయన పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.

పునేఠాకు ఎస్‌ఈసీ పదవిని చంద్రబాబు ఇవ్వలేదని, ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.

ఎన్నికల సంఘం తన స్వతంత్రతను నిలబెట్టుకోకపోతే ఆ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతుందని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పోలీసులు వాచ్‌మన్లుగా మారారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసుకుందని జగన్‌ ఆరోపించారు.

తాము అభ్యర్థులను అప్పటికప్పుడు నిర్ణయించుకున్నామని, నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పుడు తెదేపా కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని చెప్పారు.

అభ్యర్థులపై దాడులు చేయడంతోపాటు నామినేషన్‌ పత్రాలను చించివేశారని ఆరోపించారు. ఈ ఘటనల్లో పోలీసులు కూడా వారికి మద్దతుగా వ్యవహరించారని విమర్శించారు.

ఎంతో కష్టపడి నామినేషన్‌ కేంద్రాల్లోకి వెళ్లినా రిటర్నింగ్‌ అధికారులు పత్రాలను స్వీకరించడం లేదని జగన్‌ అన్నారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

పులివెందులలో పోలీసులే తెదేపా గూండాల మాదిరిగా వ్యవహరించి కాల్పులు జరిపారని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

పోలీసులు వాచ్‌మన్లుగా మారారు

ప్రభుత్వానికి పోలీసులు వాచ్‌మన్లుగా ఎందుకు మారుతున్నారని జగన్‌ ప్రశ్నించారు.

తప్పులు చేస్తున్న పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమకు కూడా సమయం వస్తుందని, అప్పుడు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ఆరంభం మాత్రమేనని, 2029 సాధారణ ఎన్నికలే తమకు తుది లక్ష్యమని వ్యాఖ్యానించారు.

వివరాలు 

కేంద్ర బలగాలతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల భద్రత మధ్య నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాను కోరారు.

పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆదివారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి పునేఠాకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితులు ఉన్నాయో ఎస్‌ఈసీకి వివరించామని జగన్‌ తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు.

ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

వివరాలు 

కేంద్ర బలగాలతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న వైకాపా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని జగన్‌ ఆరోపించారు.

వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

కర్నూలు డీఐజీ ప్రవీణ్‌ వ్యవహారశైలిపైనా జగన్‌ విమర్శలు చేశారు.

ఆయన తెదేపా కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై తెదేపా శ్రేణులు దాడి చేసి గాయపరిచినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని జగన్‌ కోరారు.

ADVERTISEMENT