Page Loader
 Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి
చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

 Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge) నిర్మాణానికి కేంద్ర బిందువుగా నిలిచిన మహిళా శాస్త్రవేత్త కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లోని రయ్యిల్‌ జిల్లాలో నిర్మించిన ఈ విప్లవాత్మక వంతెనను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశాన్ని జమ్ముకశ్మీర్‌తో రైలు మార్గంగా అనుసంధానించే ఈ వంతెన నిర్మాణంలో ప్రొఫెసర్ జి మాధవి లత 17 ఏళ్ల పాటు తన శ్రమను ధారపోశారు.

Details

వంతెన నిర్మాణంలో మాధవి లత పాత్ర

ఈ వంతెన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా నిర్మించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మాధవి లత, ఈ ప్రాజెక్ట్‌లో జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్కాన్స్ కంపెనీతో కలిసి మాధవి లత భూగర్భ నిర్మాణాలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ సూచనలిచ్చారు. హిమాలయాల వంటి అత్యంత పెలుసు భూభాగంలో వంతెన నిర్మించాల్సి రావడంతో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. భూ పరిమాణాలు, రాళ్ల బలహీనతలు, రంధ్రాలు మొదలైన అంశాలను గమనిస్తూ "Design-as-you-go" పద్ధతిని అవలంభించారు. అంటే ముందుగా ఊహించలేని భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా నిర్మాణాన్ని తక్షణమే మార్చడం.

Details

మాధవి లత విద్యా ప్రస్థానం

బి.టెక్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం (JNTU), 1992 (Distinctionతో) ఎం.టెక్: NIT వరంగల్ (Gold Medalist), జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్ పీహెచ్‌డీ: IIT మద్రాస్, 2000లో పూర్తిచేశారు గౌరవాలు: 2021లో 'ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ' నుంచి ఉత్తమ మహిళా పరిశోధకురాలి అవార్డు 2022లో *STEM of India* టాప్ 75 మహిళల్లో స్థానం "Design-as-you-go: The Case Study of Chenab Railway Bridge" అనే పత్రం ప్రచురణ

Details

చీనాబ్ వంతెన ముఖ్య విశేషాలు 

నిర్మాణ వ్యయం: రూ. 1,486 కోట్లు ఎత్తు: 359 మీటర్లు - ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఇది భారత రైల్వే చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడింది రైలు కనెక్టివిటీ లేకపోయే కాశ్మీర్ లోయకు ఇది ప్రాణవాయువుగా మారనుంది ప్రొఫెసర్ మాధవి లత లాంటి మహిళలు భారత దేశ సాంకేతిక కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నారు. చీనాబ్ వంతెన వంటి అద్భుత నిర్మాణాల వెనుక ఉన్న అసలైన శక్తి ఈవిధమైన శాస్త్రవేత్తలే అని చెప్పొచ్చు