Page Loader
Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్ 
Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్

Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్ 

వ్రాసిన వారు Stalin
Nov 27, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ముగ్గురు విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌ను కంపాస్‌లోని రౌండర్ (దిక్సూచి)తో 108 సార్లు పొడిచారు. అయినా వారి కోపం చల్లారకపోవడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం బాధిత విద్యార్థి తండ్రికి తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గరిమ విద్యా వివాహ్ స్కూల్ పరిధిలో జరిగింది.

గేమ్

క్లాస్ రూమ్‌లోనే గొడవ

4వ తరగతి ఎప్పుడూ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటుంది. అయితే సోమవారం క్లాస్ టీచర్ రాలేదు. ఇదిలా ఉండగా.. క్లాస్‌ రూమ్‌లోని ముగ్గురు విద్యార్థులు తమ సహవిద్యార్థితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ముగ్గురు రౌండర్ కంపాస్‌తో దాడి చేశారు. దాదాపు 108సార్లు పొడిచారు. అయితే బాధిత విద్యార్థి స్కూలు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.జరిగిన మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి విషయంపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.