NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం
    తదుపరి వార్తా కథనం
    హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం
    హేమమాలినితో డ్యాన్స్ చేయించానన్న హోంమంత్రి..

    హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 26, 2023
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత నటీమణి, బీజేపీ నేత హేమమాలినిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, హోంమంత్రి, నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

    మరోవైపు సొంత పార్టీ ఎంపీనే కించపరిచాడంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బీజేపీ నేతల వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ చురకలు అంటించింది.

    దాతియా నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన మిశ్రా, నాలుగోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

    రాష్ట్రంలో బీజేపీ సర్కారు హయాంలో దాతియా నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామని వివరించారు.

    details

    నరోత్తమ్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, జేడీయూ

    ఇందులో భాగంగానే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు.

    అంతేకాదు ఏకంగా హేమమాలినితోనే డ్యాన్స్ చేయించామని చెప్పుకొచ్చారు. దీంతో వేదికపై ఉన్న వారితో పాటు సభకు హాజరైన ప్రజలు గొల్లున నవ్వారు.

    హోంశాఖ మంత్రి మాటలకు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ మహిళా నాయకురాలిని, పార్లమెంట్ సభ్యురాలిని, అందున తమ పార్టీకే చెందిన వ్యక్తిపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

    ప్రతిపక్ష నేతలపైనే కాదు అవసరమైతే సొంత పార్టీకి చెందిన మహిళా నేతలనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కించపరుస్తుందన్నారు.

    మిశ్రా వ్యాఖ్యలపై స్పందించిన జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హేమమాలినిపై అవమానకర వ్యాఖ్యలుగా అభివర్ణించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    బీజేపీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి తాజా వార్తలు
    'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే ఉత్తరాఖండ్
    మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్ ఇండియా
    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి కేంద్ర ప్రభుత్వం

    బీజేపీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు  రాహుల్ గాంధీ
    మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు మధ్యప్రదేశ్
    తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌  తమిళనాడు
    'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ఉదయనిధి స్టాలిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025