
BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
ఈటెల రాజేందర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం హుజురాబాద్‌తో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ స్థానం నుంచి కూడా బరిలో దిగుతున్నారు.
ఈటెల ఈసారి ఏకంగా కేసీఆర్‌కు పోటీగా నిలబడటంపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.
తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉండగా, వారిని ఈసారి పార్టీ అసెంబ్లీ బరిలో కి దింపుతోంది.
బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు బోథ్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ మొదటి జాబితా ఇదే..
BJP announced 1st list of candidates (52 seats) for elections in Telangana.#TelanganaElections2023 pic.twitter.com/DE3cmXA0Bx
— 🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩 (@PSR4Bharat) October 22, 2023