
మధ్యప్రదేశ్: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.
చిరుతపులిని వేధిస్తూ.. దానితో సెల్ఫీలు వీడియోలు తీస్తూ హల్‌చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక్లెరా సమీపంలోని అడవిలో గ్రామస్తులకు చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. కొందరు గ్రామస్తులు మొదట దాన్ని చూసి భయపడ్డారు.
అది ఉత్సాహంగా లేకపోవడం, అలాగే ఏమీ అనకపోవడంతో అస్వస్థతకు గురైందని గ్రామస్థులకు అర్థమైంది.
ఇదే అదునుగా భావించిన గ్రామస్థులు ఆ చిరుత పట్ల దారుణంగా వ్వవహరించారు. దాని మీదకు ఎక్కి.. నీరసంగా ఉన్న చిరుతను వేధించారు.
చివరకు ఓ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి చిరుతను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని ఆస్పత్రికి తరలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనారోగ్యంతో ఉన్న చిరుతతో గ్రామస్థుల ఆటలు
Sick Leopard Wanders Into Madhya Pradesh Village, This Happens Next https://t.co/e5g6JjU3AB pic.twitter.com/LVYRTJbg4e
— NDTV (@ndtv) August 30, 2023