Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. భక్తులు సంతోషంగా దర్శనానుభూతి పొందేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా, స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులు దర్శనానికి ఎలాంటి అసౌకర్యం ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.
పాదయాత్ర భక్తుల కోసం అటవీశాఖతో సమన్వయం చేసుకుంటూ రహదారులను గ్రావెల్‌తో సరిచేస్తామని చెప్పారు.
అలాగే పాదయాత్ర దారుల్లో మంచినీటి ట్యాంకర్లు, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Details
ట్యాంకర్ల ద్వారా మంచినీటీ సరఫరా
అటవీ ప్రాంతంలోని నీరు తాగడానికి అనువుకాదనిపిస్తే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
భక్తులు వాడి పడేసిన చెప్పులు, బట్టలు వంటి వస్తువులు పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా డంపింగ్ యార్డుకు తరలించనున్నట్టు ఈవో తెలిపారు.
ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటివరకు 54 లేఖలు పంపించామని, ఈనెల 31లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.
అలాగే ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ బ్రహ్మోత్సవాలపై త్వరలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.