Page Loader
Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు

Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు

వ్రాసిన వారు Stalin
Jan 23, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. చమోర్షి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చమోర్షిలోని ఘన్‌పూర్ ఘాట్ సమీపంలోని వనగంగా నదిలో మిర్చి కోసేందుకు ఏడుగురు మహిళలు బోటుపై వెళ్తుండగా అది బోల్తా పడింది. పడవ నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మహిళలు మునిగిపోయారు. ఒక మహిళను రక్షించగా, మరో మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ టీం గల్లంతైన మహిళల కోసం గాలిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో ఒకరు సురక్షితం