కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉల్లి కొనలేని వాళ్ళు రెండు నెలల పాటు తినడం మానేయాలని అన్నారు. రూ.10లక్షల రూపాయల విలువైన కారు కొనేవాళ్ళు ఉల్లి ధర 10, 20ఎక్కువైనా కొనగలరని స్పష్టం చేశారు. ఒకవేళ ఉల్లిపాయను కొనలేని వాళ్ళు రెండు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిపాయ తినడం మనేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉల్లి ఎగుమతులపై 40శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 19వ తేదీన వచ్చిన ఈ నోటిఫికేషన్ పై ఉల్లి వ్యాపారులు నిరసన తెలియజేస్తున్నారు.
డిసెంబర్ 31వరకు అమల్లో ఉండనున్న పన్ను పెంపు నిర్ణయం
కొన్నిసార్లు ఉల్లి ధర క్వింటాల్ కు 200రూపాయలు ఉంటుందని, మరికొన్ని సార్లు 2వేల రూపాయలు ఉంటుందని భూసే అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉల్లి ఎగుమతులపై 40శాతం పన్ను విధిస్తూ ఆగస్టు 19వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను విధింపు నిర్ణయం 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండనుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది తెలియదు. ఉల్లి ఎగుమతులపై పన్ను విధించడాన్ని ఉల్లి వ్యవసాయ దారులు, వ్యాపారవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో నిరసనలు చేస్తున్నారు. నిరసనలకు కౌంటర్‌గా మహారాష్ట్ర మంత్రి దాదా పై వ్యాఖ్యలు చేశారు.