Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిరాకరించారు. పైగా షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా స్పీకర్ చెప్పడం గమనార్హం. ఏక్‌నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. జూన్ 2022లో శివసేనపై తిరుగుబాటు చేసిన షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ కూటమిలో చేరారు. ఈ క్రమంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద షిండేతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్‌కు లేదు: స్పీకర్
ఉద్ధవ్ థాకరే ఫిర్యాదుపై బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్ థాకరేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం రికార్డుల్లో షిండే వర్గానికి చెందిన శివసేన మాత్రమే నిజమైనదిగా పరిగణించబడిందని స్పీకర్ పేర్కొన్నారు. షిండే వర్గంలో మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, భరత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామినీ జాదవ్, అనిల్ బాబర్, తానాజీ సావంత్, లతా సోనావానే, ప్రకాష్ సర్వే, బాలాజీ కినికర్, సందీపన్ భూమ్రే, బాలాజీ కల్యాణ్‌కర్ ఉన్నారు. , రమేష్ బోనారే, చిమన్‌రావ్ పాటిల్, సంజయ్ రైముంకారి ఎమ్మెల్యేలు ఉన్నారు