Mahua Moitra : 'క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో మలుపు.. ఇవాళ లోక్‌సభ ముందుకు రానున్న ఎథిక్స్ ప్యానెల్ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
'క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆమెపై తయారు చేసిన నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
ఈ క్రమంలోనే మోయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించాలని నివేదిక ద్వారా కమిటీ సిఫార్సు చేస్తోంది.
తొలుత డిసెంబరు 4న దిగువసభ అజెండాలో నివేదిక సమర్పణకు జాబితా చేసినప్పటికీ దానిని సభలో ప్రవేశపెట్టలేదు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై నిర్ణయం తీసుకునే ముందు ఎథిక్స్ ప్యానెల్ సిఫార్సులపై చర్చకు పలువురు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
తాజాగా ఇవాళ మోయిత్రాపై ఎథిక్స్ ప్యానెల్ నివేదిక లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇవాళ లోక్ సభ ముందుకు రానున్న ఎథిక్స్ కమిటీ ప్యానెల్ రిపోర్టు
Winter Session of Parliament | Ethics Panel report on TMC MP Mahua Moitra to be tabled in the Lok Sabha tomorrow pic.twitter.com/2lKspC4hEq
— ANI (@ANI) December 7, 2023