
Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన ఆమెను.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఎస్టేట్ డైరెక్టరేట్ మంగళవారం మరోసారి నోటీసు జారీ చేసింది.
ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒక వేళ బంగ్లాను ఖాళీ చేయకుంటే .. బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన తర్వాత.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువా మొయిత్రాకు ఇప్పటికే ఎస్టేట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. కానీ ఆమె ఖాళీ చేయలేదు.
పార్లమెంట్
కోర్టులో లభించని ఉపశమనం
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు స్వీకరించడంతో పాటు, పార్లమెంటు వెబ్‌సైట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అతనికి ఇచ్చారన్న ఆరోపణలపై డిసెంబర్ 8న మోయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించబడ్డారు.
పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఆమె ఇకపై ఈ బంగ్లాలో ఉండటానికి అర్హురాలు కాదు.
ఈ క్రమంలో నిబంధనల ప్రకారం బంగ్లాను ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు.
ఖాళీ చేయకుండా ఉండేందుకు ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టులో కూడా ఆమెకు ఉపశమనం లభించలేదు.
దీంతో ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని మహువాను నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయకుంటే బలవంతంగా పంపించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొనడం గమనార్హం.