NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్
    తదుపరి వార్తా కథనం
    Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్
    సభ నుంచి విపక్షాల వాకౌట్

    Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 08, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

    ఈ మేరకు డబ్బులు తీసుకుని దిగుల సభలో ప్రశ్నలు అడిగారన్న కేసులో ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది.

    ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది.

    ఫలితంగా ఆమె ఎంపీగా కొనసాగడం తగదని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు.దీంతో మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

    ఎథిక్స్‌ కమిటీ నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

    details

    ఓటింగ్'కు ముందు చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

    ఎథిక్స్‌ కమిటీ నివేదికపై అధ్యయనానికి మరింత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీతో పాటు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.

    ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి మంజూరు చేశారు. దీంతో అధికార,విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.

    ఇదే సమయంలో చర్చలో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని మహువా కోరగా సభాపతి తిరస్కరించారు.అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది.

    ఈ మేరకు మహువాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించేశారు.అనంతరం సభను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తీరుకు నిరసినగా విపక్షాలు వాకౌట్‌ చేశాయి. వేటు అనంతరం తమ ఇంటికి సీబీఐ వస్తుందేమోనని మహువా ఆందోళన వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లోక్ సభ నుంచి బహిష్కరణకు గురైన మహువా

    TMC MP Mahua Moitra expelled from the Lok Sabha in 'cash for query' matter.

    Ethics Committee report was tabled in the House today. pic.twitter.com/73dSVYFvOb

    — ANI (@ANI) December 8, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వేటుపై తీవ్రంగా స్పందించిన ఎంపీ మహువా మోయిత్రా

    #WATCH | Mahua Moitra on her expulsion as a Member of the Lok Sabha says, "...If this Modi government thought that by shutting me up they could do away with the Adani issue, let me tell you this that this kangaroo court has only shown to all of India that the haste and the abuse… pic.twitter.com/DKBnnO4Q0d

    — ANI (@ANI) December 8, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అధికార బీజేపీ తీరుపై బెంగాల్ సీఎం అసంతృప్తి

    #WATCH | TMC chairperson Mamata Banerjee on the expulsion of Mahua Moitra from Lok Sabha

    " Today, I am sad to see the attitude of the BJP party...How they betray democracy...They didn't allow Mahua to explain her stand. Full injustice has been done. " pic.twitter.com/ljCkLHwlHk

    — ANI (@ANI) December 8, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహువా మోయిత్రాపై వేటు పడ్డట్లు ప్రకటిస్తున్న స్పీకర్ 

    #WATCH | Cash for query matter | TMC's Mahua Moitra expelled as a Member of the Lok Sabha; House adjourned till 11th December.

    Speaker Om Birla says, "...This House accepts the conclusions of the Committee that MP Mahua Moitra's conduct was immoral and indecent as an MP. So, it… pic.twitter.com/mUTKqPVQsG

    — ANI (@ANI) December 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహువా మోయిత్రా

    తాజా

    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ

    మహువా మోయిత్రా

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  తృణమూల్ కాంగ్రెస్‌
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా బీజేపీ
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  లోక్‌సభ
    Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025