LOADING...
Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం 
ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం 

వ్రాసిన వారు Stalin
May 25, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

Details 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది 

17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అనుమానిస్తున్నారు. శిధిలాల కింద పడి మరికొంత మంది చనిపోయి వుంటారని తెలుస్తోంది. దాదాపుగా 60 మంది గాయపడ్డారని ప్రాధమికంగా తెలుస్తోంది. రాజధాని రాయ్ పూర్ కి ప్రమాద స్ధలం 30 కిలోమీటర్ల దూరంలో వుంది.