Year Ender 2024: ఈ ఏడాది విద్యారంగంలో పెనుమార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
2024లో భారతదేశ విద్యావ్యవస్థలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వేదికపై గుర్తింపు పొందినా, అదే సమయంలో పేపర్ లీక్ కేసులు ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులు తలెత్తించాయి.
అయితే విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఏడాది విద్యావ్యవస్థలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్యమైన మార్పులను చూద్దాం.
పీఎంశ్రీ
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 కింద పీఎం శ్రీ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటిని సమగ్ర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించారు.
ఈ విద్యాలయాలు విద్యార్థులకు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, క్యారెక్టర్ బిల్డింగ్ అంశాలలో ప్రేరణ ఇవ్వడం ద్వారా అకడమిక్ పరిజ్ఞానం పెంచాలని లక్ష్యంగా ఉన్నాయి.
Details
పీఎం విద్యా లక్ష్మి యోజన
2024లో ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజన ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
దేశంలోని 860 ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు కనీస వడ్డీ రేట్లతో విద్యా రుణాలు అందుతాయి.
ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. వచ్చే ఏడళ్లలో రూ.3,600 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
Details
వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్
దేశంలోని విద్య, పరిశోధన రంగానికి కొత్త దిశనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద విద్యార్థులు, పరిశోధకులు జాతీయ స్థాయిలో అకడమిక్ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధన డేటాబేస్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు.
ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు డిజిటల్ విప్లవంగా మారింది.
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం
ఈ పథకాన్ని 2024లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు, ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లను చేయవచ్చు.
ఈ పథకం యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పరచడంలో సాయపడుతుంది.