LOADING...
Fire Accident: రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు 
రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

Fire Accident: రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్‌ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగాలీ బస్తీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి సహా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మంటల వేగం కారణంగా గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్‌ సిలిండర్లు వరుసగా పేలిపోవడంతో మంటల తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు తెలిపారు.

Details

భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం

దట్టమైన పొగతో మొత్తం ప్రాంతం కమ్ముకుపోయి, బాధితులు బయటకు రావడానికే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు విస్తృతంగా ప్రయత్నించారు. మొత్తం 29 ఫైరింజన్లను అక్కడికి తరలించగా, అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు ఈ అగ్నిప్రమాదాన్ని మీడియం కేటగిరీగా వర్గీకరించారు. మంటల కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.