తదుపరి వార్తా కథనం
Hyderabad Fire Accident: మూసాపేట ICD డిపోలో భారీ అగ్ని ప్రమాదం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 25, 2025
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్(ICD)డిపోలోని గోదాం రసాయన విభాగంలో జరిగింది. గోదాంలో నిల్వ ఉంచిన రసాయనాలను, అలాగే కార్పొరేషన్ గోదాంలోని లిక్కర్ నిల్వ ప్రాంతాన్ని మంటలు వ్యాపించాయి. ప్రమాదం గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు, రెండు ఆటోమేటిక్ రోబోలు చేరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ మంటల్లో పెద్ద మొత్తంలో లిక్కర్ దగ్ధమై, కోట్ల రూపాయల ఆస్తి నష్టం తలెత్తిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గాయపడ్డవారిపై సమాచారం లేదు. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.