LOADING...
Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే 
Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఇండియా కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సీట్ల షేరింగ్‌పై చర్చించారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టనున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇండియా కూటమి కన్వీనర్ పదవికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీష్ కుమార్ పార్టీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.

కాంగ్రెస్

మమతా బెనర్జీ, అఖిలేష్, ఠాక్రేతో చర్చించిన తర్వాత ప్రకటన

వాస్తవానికి, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశానికి హాజరు కాలేదు. దీంతో హాజరుకాని పార్టీల ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత కన్వీనర్ పదవిపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేత సీతారాం ఏచూరి, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా 14 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే ఖర్గే అధ్యక్షతన పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సమన్వయకర్తలతో సమావేశాన్ని నిర్వహించి.. వారికి దిశానిర్దేశం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్‌కే ఇండియా చీఫ్ పదవి