LOADING...
Delhi airport: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Delhi airport: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో శుక్రవారం ఉదయం ఏర్పడ్డ టెక్నికల్ సమస్య వల్ల 100 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ సమస్యకు మాల్వేర్ దాడి కారణమై ఉండొచ్చని News18 రిపోర్ట్ చేసింది. విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో లోపం రావడంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ లాంటి కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడింది. Automatic Message Switching System (AMSS) అనే కీలక సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల కంట్రోలర్లు ఫ్లైట్ ప్లాన్స్‌ని మేనువల్‌గా చెక్ చేసి క్లియర్ చేస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులకు,అలాగే విమాన సంస్థలకు కూడా అసౌకర్యం కలిగింది.

వివరాలు 

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన

"సిస్టమ్ సమస్య త్వరగా పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్స్ పని చేస్తున్నాయి. అంతవరకు కొంత ఆలస్యం తలెత్తవచ్చు. ప్రయాణికులు తమ తమ విమానాల స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి" అని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక ప్రకటనలో తెలిపింది. ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.ఇక్కడ రోజుకు దాదాపు 1500లకు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి. గురువారం సాయంత్రం నుండే ఈ లోపం కనిపించినట్లు సమాచారం. విమాన సంస్థలు కూడా ప్రయాణికులకు హెచ్చరికలు జారీచేశాయి. స్పైస్ జెట్ ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది.

వివరాలు 

IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3 బయట క్యూలో నిలబడిన ప్రయాణికులు 

ఎయిర్ ఇండియా కూడా X (Twitter) ద్వారా స్పందించింది."ATC సిస్టమ్ సమస్య వల్ల అన్ని విమాన సంస్థల ఫ్లైట్ కార్యకలాపాలు ప్రభావితం అవుతున్నాయి. విమానాశ్రయం, విమానాల్లో వేచి ఉండే సమయం పెరగొచ్చు. అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం" అని తెలిపింది. ఇదిలా ఉండగా, IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3 బయట ప్రయాణికులు క్యూలలో నిలబడి ఉన్న వీడియోను ANI విడుదల చేసింది. అధికారులు సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.