LOADING...
Mamata Banerjee: ఓటమి ఒప్పుకోని మమత.. సీఎం పదవి కొనసాగుతుందా? చట్టం ఏమంటోంది?
ఓటమి ఒప్పుకోని మమత.. సీఎం పదవి కొనసాగుతుందా? చట్టం ఏమంటోంది?

Mamata Banerjee: ఓటమి ఒప్పుకోని మమత.. సీఎం పదవి కొనసాగుతుందా? చట్టం ఏమంటోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. మే 4న వచ్చిన అసెంబ్లీ ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబించడం లేదని, ఇది ఒక కుట్ర ఫలితమని ఆరోపించారు. తాము బీజేపీతో కాకుండా ఎన్నికల సంఘంతో పోరాడాల్సి వచ్చిందని ఆమె విమర్శించారు. మే 5న కోల్‌కతాలో జరిగిన ప్రెస్ మీట్‌లో "మేము ఓడిపోలేదు, ఓట్లు దోచుకున్నారు.. రాజీనామా ప్రశ్నే లేదు" అని ఆమె స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దాదాపు 100 స్థానాల్లో తీర్పు 'లూటీ' అయిందని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని తెలియజేస్తూ ఎన్నికల సంఘం కొత్త అసెంబ్లీ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ చేసింది.?

వివరాలు 

రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం..

ఇక అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన తర్వాత సీఎం పదవిలో కొనసాగడం సాధ్యం కాదని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి. బీజేపీ 294 స్థానాల్లో 200కి పైగా గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించగా, మమత కొనసాగలేరని నిపుణులు చెబుతున్నారు. భారత రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం అసెంబ్లీ మద్దతు ఉన్నంతకాలమే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలి. మెజారిటీ కోల్పోతే గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు 2026 మే 7తో ముగియనుండటంతో, ఆ తర్వాత మమత పదవి సహజంగానే ముగుస్తుంది.

Advertisement