LOADING...
Mamata Banerjee: 'మేము ఓడిపోలేదు.. ఓడించారు'.. రాజీనామాకు మమతా బెనర్జీ నో
'మేము ఓడిపోలేదు.. ఓడించారు'.. రాజీనామాకు మమతా బెనర్జీ నో

Mamata Banerjee: 'మేము ఓడిపోలేదు.. ఓడించారు'.. రాజీనామాకు మమతా బెనర్జీ నో

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ తాము ఓడిపోలేదని, ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, బీజేపీతో కలిసి 100 సీట్లు దోచుకుందని అన్నారు. ఎన్నికలకు ముందు తమ నేతలను అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ దాడులు చేయడం, అధికారులను బదిలీ చేయడం జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా ఇందులో నేరుగా భాగస్వాములేనని ఆరోపించారు. బూత్ వద్ద తనను తోసి బయటకు పంపారని, మహిళగా తనపై అనుచితంగా ప్రవర్తించారని మమతా ఆరోపించారు.

వివరాలు 

ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించలేదు: మమతా  

CRPF సిబ్బంది, బయటి గుంపులు దాడులకు పాల్పడ్డాయని, తన వాహనాన్ని అడ్డుకున్నారని తెలిపారు. తమ ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించలేదని, తనపై దాడి చేశారని చెప్పారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజాస్వామ్య హత్య అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్ సహా ఇండియా కూటమి నేతలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. త్వరలో అఖిలేష్ యాదవ్ వస్తారని చెప్పారు. కేంద్రం ఒకే పార్టీ ప్రభుత్వం కోరుకుంటోందని, ఎన్నికల వ్యవస్థ పక్షపాతంగా మారిందని మమతా విమర్శించారు. అయినప్పటికీ తాము తిరిగి బలంగా నిలబడతామని, బెంగాల్‌లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement