Page Loader
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..

Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 

వ్రాసిన వారు Stalin
Mar 03, 2024
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్‌ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో భర్తే తన భార్యను హత్య చేసినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని 51 ఏళ్ల సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘజియాబాద్‌లోని ఓ కాలనీలో భరత్‌సింగ్‌- సునీత దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలో భార్యభర్తలను హత్య చేసినట్లు భరత్ సింగ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఘజియాబాద్‌లో దారుణ హత్య