LOADING...
Delhi: ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. ఢిల్లీ వైద్యురాలిపై అత్యాచారం 
ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. ఢిల్లీ వైద్యురాలిపై అత్యాచారం

Delhi: ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. ఢిల్లీ వైద్యురాలిపై అత్యాచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ఓ షాకింగ్‌ సంఘటన వెలుగుచూసింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ వైద్యురాలిపై దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమెజాన్‌ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఆరవ్‌ మాలిక్‌ అనే యువకుడు తనను తాను భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ అధికారిగా చెప్పుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ వైద్యురాలితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెను నమ్మించేలా ఆర్మీ యూనిఫార్మ్‌ వేసుకున్న ఫోటోలను తరచూ పంపిస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. అనంతరం వారు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకోవడం ప్రారంభించారు.

వివరాలు 

ఆన్‌లైన్‌లో ఆర్మీ యూనిఫార్మ్‌ కొనుగోలు చేసి..

ఇటీవల మాలిక్‌ వైద్యురాలి ఇంటికి వెళ్లినప్పుడు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చాడు. దాన్ని తిన్న అనంతరం వైద్యురాలు స్పృహ తప్పి మత్తులోకి జారుకుంది. ఆ సమయంలో నిందితుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన వైద్యురాలు జరిగిన దారుణాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు వైద్యురాలిని ఉచ్చులో పడేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఆర్మీ యూనిఫార్మ్‌ కొనుగోలు చేసి, ఆ ఫోటోలు పంపినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.