Page Loader
Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 
Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి

Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 

వ్రాసిన వారు Stalin
Feb 24, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి 9.25 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు బాంబును పేల్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించగా.. ఓయినమ్ కెనెగి (24) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సలామ్ మైఖేల్ (24) అనే వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో మరొకరికి గాయాలు