Page Loader
Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 
మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం

Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 

వ్రాసిన వారు Stalin
Aug 02, 2023
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మిస్సింగ్ ఫిర్యాదుల్లో నమోదు కాని ఎఫ్‌ఐఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే అదృశ్యమైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 47ఏళ్ల ఆటమ్ సమరేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ అదృశ్యమైనట్లు ఆయన భార్య కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో పాటు, అతని స్నేహితుడు యుమ్‌ఖైబామ్ కిరణ్‌కుమార్ సింగ్ తప్పిపోయినట్లు కవిత చెప్పారు. తాజాగా సమరేంద్ర సింగ్ భార్య కవిత ఆచూకీ కూడా లభించకపోవడంతో మిస్సింగ్ కేసులపై మరింత ఆందోళన కలిగిస్తోంది. మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంతవరకు వారి జడ దొరకలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మణిపూర్

6వేలకు పైగా జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు

సమరేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్, అతని స్నేహితుడు అదృశ్యమైన రెండు నెలల తర్వాత, ఇంఫాల్‌లో జూలై 6న మరో విషాదం చోటుచేసుకుంది. ఆ రోజు కర్ఫ్యూ సడలించడంతో 17ఏళ్ల హిజామ్ లువాంగ్బీ లింతోంగంబి 17 తన నీట్ కోచింగ్ తరగతుల కోసం ఇంటి నుంచి బయలుదేరింది. తన స్నేహితుడు ఫిజామ్ హేమంజిత్ కలిసి బైక్‌పై వెళ్లింది. ఆ తర్వాత వారు ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి తల్లిదండ్రులు రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన తర్వాత 6వేలకు పైగా జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయింటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మిస్సింగ్ కేసులే ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.