Page Loader
Sharad Pawar: మహారాష్ట్రలో మణిపూర్‌ పరిస్థితి: శరద్ పవార్  
మహారాష్ట్రలో మణిపూర్‌ పరిస్థితి: శరద్ పవార్

Sharad Pawar: మహారాష్ట్రలో మణిపూర్‌ పరిస్థితి: శరద్ పవార్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2024
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నవీ ముంబైలోని వాషిలో నిర్వహించిన "సామాజిక ఐక్యతా మండలి" సందర్భంగా, మణిపూర్‌లో జరిగిన సంఘటనల మాదిరిగానే మహారాష్ట్రలో అశాంతి ఏర్పడుతుందనే భయాన్ని NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ఒకప్పుడు ఐక్యంగా ఉన్న కుకీ-మీతేయి సంఘాలు ఇప్పుడు అరాచకం, హింసకు దిగాయని ఆయన ఉద్ఘాటించారు. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య పరస్పర వివాదాల కారణంగా నెలరోజులుగా హింసాకాండ కొనసాగుతోందని శరద్ పవార్ తన ఆందోళనను వ్యక్తం చేశారు. దీని కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, మహిళలపై వేధింపులు,డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లో ఒకప్పుడు రెండు వర్గాలు కలిసి జీవించేవారని, ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సిద్ధంగా లేరని ఆయన అన్నారు.

వివరాలు 

మహారాష్ట్రలో పరిస్థితి మణిపూర్ లాగా ఉండవచ్చు! 

శరద్ పవార్ మాట్లాడుతూ, 'మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ఈ రెండు సముహాల జాతి హింసను పరిష్కరించడంతో కేంద్రం ప్రభుత్వం విఫలమైంన్నారు . మణిపూర్ లాగే, మహారాష్ట్రలో కూడా మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి కూడా నిరసనలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్‌ తరహాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అయితే, మహారాష్ట్రలో ఎంతో మంది మహనీయులు సామరస్యాన్ని పెంపొందించారు, కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చుఅనుకుంటున్నారు. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలన్నారు. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదన్నారు.