LOADING...
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉఖ్రుల్ లిటాన్‌లో కాల్పులు, 21 ఇళ్లు దగ్ధం
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉఖ్రుల్ లిటాన్‌లో కాల్పులు, 21 ఇళ్లు దగ్ధం

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉఖ్రుల్ లిటాన్‌లో కాల్పులు, 21 ఇళ్లు దగ్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లా లిటాన్ ప్రాంతంలో హింస మూడో రోజుకు చేరడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం, క్రమంగా పెద్ద ఎత్తున హింసకు దారి తీసింది. మొదట బాధితుడి వర్గం, లిటాన్ సారేఖాంగ్ గ్రామ పెద్ద మధ్య చర్చలతో సమస్యను సంప్రదాయ పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయించినా, ఆదివారం జరగాల్సిన సమావేశం రద్దవ్వడంతో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. సమీప సికిబుంగ్ ప్రాంతానికి చెందిన కొందరు లిటాన్ గ్రామ పెద్ద ఇంటిపై దాడి చేయడంతో పాటు, పోలీస్ స్టేషన్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

కాల్పుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేత 

ఆదివారం రాత్రి రెండు గిరిజన వర్గాల మధ్య రాళ్ల రువ్వుకోడంతో, ఆంక్షలు విధించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో కుకీ మిలిటెంట్లు టాంగ్‌ఖుల్ నాగల ఇళ్లకు నిప్పంటించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 21 ఇళ్లు దగ్ధమయ్యాయని మంత్రి గోవిందాస్ కొంతౌజం వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేయగా, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సీఎం య్. ఖేమ్‌చంద్ సింగ్ ఈ ఘటన అపార్థం వల్ల జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెబుతూ ప్రజలు శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టి ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement