100 రోజల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. ఆయన శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్న వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. మే 3న రాష్ట్రంలో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో 100రోజలు తర్వాత రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మళ్లీ మొదలు కానున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన తర్వాత.. సామాజిక మాధ్యమాల ద్వారా హింసను ప్రేరేపించే సందేశాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.