
Manmohan Singh:మన్మోహన్ సింగ్ ఏమి చదువుకున్నారు?అయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఈ వార్త దేశానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.
92 ఏళ్ల వయస్సులో, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ విషాదకరమైన ఘటనతో దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది.
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని) గాహ్ గ్రామంలో జన్మించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఐఎంఎఫ్,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి కీలక పదవులను నిర్వహించిన ఆయన,భారతదేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి,ప్రధానమంత్రిగా తన సేవలు అందించారు.
ఆయన స్వభావం చాలా సాదాసీదాగా ఉండేది,చాలా తక్కువ మాట్లాడేవారు.రాజకీయాలలో,దేశ ఆర్థిక వ్యవస్థలో తన ప్రత్యేక ముద్రను వేశారు.
వివరాలు
మన్మోహన్ సింగ్ చదువు
ఆయన విద్యాభ్యాసం పంజాబ్ విశ్వవిద్యాలయంతో ప్రారంభమైంది. 1948లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన తరువాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణితో పట్టా పొందిన ఆయన, 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్ పూర్తి చేశారు.
కెరీర్
మన్మోహన్ సింగ్ కెరీర్ 1960లో పంజాబ్ విశ్వవిద్యాలయంతో ప్రారంభమైంది. ఆయన మొదట లెక్చరర్‌గా పని చేసి, తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు.
1960లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా, 1971లో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన ఆయన, అంచెలంచెలుగా ప్రధాని స్థాయికి చేరుకున్నారు.
వివరాలు
ఆస్తుల విలువ
ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా పలు కీలక పదవుల్లో సేవలు అందించారు.
2004లో భారతదేశ ప్రధాని అవ్వగా, 2009లో రెండోసారి ఈ పదవిని చేపట్టారు.
సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడే మన్మోహన్ సింగ్, రాజకీయాల్లో తన విలక్షణతను చూపించగలిగారు.
ఆయన ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలుగా, ఢిల్లీ,చండీగఢ్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు ఆయన రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.