
Indian Railways: సెప్టెంబర్ 9 వరకు పలు రైళ్లు రద్దు.. మీ ప్రయాణానికి ముందే చెక్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
మీరు ఆగస్టు నెలలో రైలులో ప్రయాణించాలని భావిస్తే.. బయలుదేరే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి. దేశవ్యాప్తంగా రైల్వేలు పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతులు, సాంకేతిక పునరుద్ధరణల పనులు చేపడుతుండటంతో అనేక రైళ్లను రద్దు చేశాయి. రోజూ కోట్లాది మంది రైల్లో ప్రయాణిస్తుండగా ఈ తాత్కాలిక రద్దులు పలు ప్రాంతాల్లో ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రద్దులు ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి.
Details
పూర్తిగా రద్దు చేసిన రైళ్లు
18175/18176 హతియా - ఝార్సుగూడ - హతియా మెము ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 18, 2025 నుంచి సెప్టెంబర్ 10, 2025 వరకు రద్దు. 17007 చర్లపల్లి - దర్భంగా ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీల్లో రద్దు. 17008 దర్భంగా - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీల్లో రద్దు. 18523 విశాఖపట్నం - బనారస్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):ఆగస్టు 27, 31; సెప్టెంబర్ 7, 10 తేదీల్లో రద్దు. 18524 బనారస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):ఆగస్టు 28; సెప్టెంబర్ 1, 8, 11 తేదీల్లో రద్దు. 17005 హైదరాబాద్ - రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):ఆగస్టు 28న రద్దు.
Details
పూర్తిగా రద్దు చేసిన రైళ్లు1/2
17006 రక్సౌల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్(వయా రాంచీ):ఆగస్టు 31న రద్దు. 07051 చర్లపల్లి-రక్సౌల్ స్పెషల్(వయా రాంచీ):ఆగస్టు 30న రద్దు. 07052 రక్సౌల్-చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ):సెప్టెంబర్ 2న రద్దు. 07005 చర్లపల్లి-రక్సౌల్ స్పెషల్ (వయా రాంచీ):సెప్టెంబర్ 1న రద్దు. 07006 రక్సౌల్-చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ):సెప్టెంబర్ 4న రద్దు. 18310 జమ్మూ తావి-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ): సెప్టెంబర్ 7న రద్దు. 13425 మాల్డా టౌన్-సూరత్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ): సెప్టెంబర్ 6న రద్దు. 13426 సూరత్-మాల్డా టౌన్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ): సెప్టెంబర్ 8న రద్దు. 15028 గోరఖ్‌పూర్-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 8న రద్దు. 18309 సంబల్పూర్-జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ):సెప్టెంబర్ 9న రద్దు. 15027 సంబల్పూర్- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్:సెప్టెంబర్ 9న రద్దు.
Details
స్వల్పకాలికంగా నిలిపిన రైళ్లు
15028 గోరఖ్‌పూర్ - సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 23, 27, 29, 31 తేదీల్లో హతియా స్టేషన్ వద్ద నిలిపివేత. హతియా-సంబల్పూర్ మధ్య మాత్రమే నిలిపివేత ఉంటుంది. 15027 సంబల్పూర్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 24, 26, 28, 30, సెప్టెంబర్ 1 తేదీల్లో హతియా స్టేషన్ వద్ద నిలిపివేత. ఈ రైలు సంబల్పూర్-హతియా మధ్య మాత్రమే నిలిపివేయబడుతుంది. ప్రయాణికులకు సూచన ఈ మార్పులు మీ ప్రయాణ ప్రణాళికపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను పరిశీలించడం మంచిది. IRCTC, NTES లేదా సంబంధిత రైల్వే జోన్ వెబ్‌సైట్ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు.