
Masood Azhar: బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో మసూద్ అజార్
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ ఉగ్రవాది,భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న మసూద్ అజార్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ వరుసగా బుకాయిస్తున్నప్పటికీ, వారి ఈ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. మసూద్ అజార్ పాక్‌లో లేడన్న వారి మాటలు నిజం కాదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా రుజువు చేశాయి. మసూద్ అజార్ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు భారత నిఘా సంస్థలు నిర్ధారించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోని గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజార్ సంచరిస్తున్న సమాచారం భారత ఇంటెలిజెన్స్ తాజాగా అందించింది. మసూద్ అజార్ కదలికలపై నిఘా పెట్టిన భారత నిఘా సంస్థలు.. బహవల్పూర్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో అతను ఉన్నట్లు గుర్తించాయి.
వివరాలు
స్కర్దూ,సద్‌పారా ప్రాంతాల్లో మసూద్ అజార్
అలాగే ఇటీవల స్కర్దూ,సద్‌పారా ప్రాంతాల్లో కూడా మసూద్ అజార్ కనిపించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆప్రాంతాల్లో గల ప్రైవేట్, ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల్లో అతను తలదాచుకున్నట్లు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ఆల్ అజీరా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్ అజార్ తమ దేశంలో లేడని బుకాయించారు. అంతేకాదు, మసూద్ అజార్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత ప్రభుత్వానికి ఏమైనా సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని,అప్పుడు తామే అతన్ని అరెస్టు చేస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే,మసూద్ అజార్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో..బిలావల్ భుట్టో మరోసారి ఏం సమాధానం ఇస్తారో చూడాల్సిందే.
వివరాలు
భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు మసూద్ అజార్ ప్రధాన సూత్రధారి
భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు మసూద్ అజార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడి నుంచి 2019లో పుల్వామా ఘటన వరకు అతని పాత్ర కీలకమైనదే. పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ అన్ని కారణాల వల్ల మసూద్ అజార్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది.