Loading...
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద.. 36,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద.. 36,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద.. 36,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం భారీగా తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జూరాల నుంచి శ్రీశైలం వైపు ప్రస్తుతం కేవలం 36,233 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. నిన్న సాయంత్రం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. శ్రీశైలం డ్యామ్‌ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 878 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలంలో 178.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

వివరాలు

దిగువ ప్రాంతాలకు నీరు విడుదల

మరోవైపు శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

రెండు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా 38,369 క్యూసెక్కుల నీటిని సాగర్‌ వైపు విడుదల చేస్తున్నారు.

దీంతో శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల కొనసాగుతోంది.

ADVERTISEMENT