Page Loader
Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం!
బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం!

Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

చత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత కొనసాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో యాంటీ-నక్సల్‌ చర్యల్లో భద్రతా దళాలు మావోయిస్టులు కనిపిస్తే కాల్పుల మోత మోగిస్తున్నారు. గతంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎదురుదాడిలో చనిపోవడం తెలిసిందే. తాజా ఘటన శనివారం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హత్యకు గురయ్యారు. అక్కడ నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుళ్ల పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Details

మొత్తం ఏడుగురు మృతి

నాలుగు రోజులుగా ఆ అటవీ ప్రాంతంలో నడుస్తున్న సెర్చ్ ఆపరేషన్లలో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), కస్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) భద్రతా సిబ్బందులు నాలుగు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం, శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్లలో సుధాకర్, భాస్కర్ మృతిచెందారు. భాస్కర్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. సుధాకర్‌పై రూ.40 లక్షల రివార్డు కూడా ఉన్నది.