LOADING...
Yadagirigutta: భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు
భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు

Yadagirigutta: భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాద‌గిరిగుట్ట మండ‌లంలో శ‌నివారం ఉద‌యం పెద్ద‌కందుకూరులోని ప్రీమియ‌ర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్ర‌మలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Details

పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు

క్షతగాత్రులను ప్రస్తుతం చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ ఎమర్జెన్సీ సైర‌న్‌తో పరిశ్ర‌మ యాజమాన్యం కార్మికుల‌ను అప్రమత్తం చేయగా, భయంతో వారు బయటకు పరిగెత్తారు. కానీ 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.