Loading...
Mumbai International Airport: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు
ఆందోళనలో ప్రయాణికులు

Mumbai International Airport: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
08:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1Bలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబై ఫైర్ బ్రిగేడ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రవీంద్ర అంబుల్గేకర్ తెలిపిన వివరాల ప్రకారం,టెర్మినల్‌లో ఉన్న కేబుల్ ట్రేలు,స్విచ్ బాక్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్‌కే పరిమితమైందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్,పోలీసులు, వార్డు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో టెర్మినల్ లోపల దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు కనిపించాయి. విలే పార్లే ప్రాంతంలోని ఈ విమానాశ్రయంలో సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సీటింగ్ ఏరియాలో మంటలు మొదలైనట్లు సమాచారం.Embed

వివరాలు 

అదుపులోకి మంటలు 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంటలను ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ముంబైలోని అంధేరి ప్రాంతంలో విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగింది.

ఆ సమయంలో కూడా ఫైర్ బ్రిగేడ్ అధికారులు వెంటనే చేరుకుని మంటలను ఆర్పారు. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

భవనంలోని ఎసీ యూనిట్, ఎగ్జాస్ట్ డక్టింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

దాదాపు 70 నుంచి 80 మంది వివిధ అంతస్తుల్లో చిక్కుకుపోయినప్పటికీ, ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం

ADVERTISEMENT