LOADING...
Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు
ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు

Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. ఆ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించగా, ఘటన స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వివరాలు 

ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు స్థానిక ప్రజల్లో భయానకాన్ని నెలకొల్పుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఓ ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ స్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. అదే ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాద ఘటన మరిచిపోకముందే తాజాగా మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం