Loading...
Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు
నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు

Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు ఆవరణలోని సీ హార్స్‌ జంక్షన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. జేఎం భక్షి (J.M. Baxi) కంపెనీకి చెందిన నిర్మాణంలో ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాటు దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

వివరాలు 

నిప్పురవ్వలే ప్రమాదానికి కారణమా?

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోర్టు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద వెల్డింగ్‌ పనులు జరుగుతున్న సమయంలో వెలువడిన నిప్పురవ్వల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోర్టు అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాఖ పోర్టు అథారిటీలో అగ్నిప్రమాద దృశ్యాలు ..

ADVERTISEMENT