Page Loader
Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీగా ఎగిసి పడిన మంటలు
గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీగా ఎగిసి పడిన మంటలు

Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీగా ఎగిసి పడిన మంటలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్‌ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 'అనుపమా' సీరియల్‌ టెంట్‌ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC) అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుంది.

Details

సెట్లో మంటలు చెలరేగిన సమయం

గోరేగావ్‌ (తూర్పు) లోని ఫిల్మ్ సిటీలో ఉన్న దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలోని మరాఠీ 'బిగ్ బాస్' సెట్‌ వెనుక ఉదయం 6.10 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి నలుగురు అగ్నిమాపక యంత్రాలు, అనేక పెద్ద నీటినిట్యాంకర్లను తరలించారు. అగ్నిమాపక చర్యలు, పరిస్థితి ఘటనాస్థలంలో అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్‌తో పాటు మరో ముగ్గురు స్టేషన్ అధికారులు అగ్నిమాపక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని ఒక అధికారి వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని అధికారులు తెలిపారు.